Share News

రావణుడు పుట్టిన ఊరు అదేనా? ఆ గ్రామస్థులు చెబుతున్న ఆసక్తికర విశేషాలు..

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:47 PM

ఉత్తర్‌ప్రదేశ్, గౌతమ బుద్ధ నగర్ జిల్లాలోని బిశ్రఖ్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. రావణాసురుడు ఈ గ్రామంలోనే పుట్టాడని గ్రామస్థులు నమ్ముతారు.

రావణుడు పుట్టిన ఊరు అదేనా? ఆ గ్రామస్థులు చెబుతున్న ఆసక్తికర విశేషాలు..
Ravana Birthplace

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్, గౌతమ బుద్ధ నగర్ జిల్లాలోని బిశ్రఖ్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. రావణాసురుడు ఈ గ్రామంలోనే పుట్టాడని గ్రామస్థులు నమ్ముతారు. బిశ్రఖ్‌లోని పురాతన ఆలయంలో స్వయంభూ శివలింగం ఉంది. రావణుడి తండ్రి విశ్రవ ముని దీన్ని కనుగొన్నారని.. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించి, పూజలు చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ శివలింగం పొడవు ఎంతనేది ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేకపోయారట. ఎంత తవ్వినా కూడా శివలింగం ముగింపు దొరకలేదట. రావణుడు కూడా తన బాల్యంలో ఇక్కడే ఘోర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని స్థానికుల నమ్మకం.

bisrakh.jpg


విశ్రవ పేరు మీదుగానే ఆ గ్రామానికి బిశ్రఖ్ అనే పేరు వచ్చిందట. ఈ గ్రామ ప్రజలు రావణాసురుడిని దేవుడిలా పూజిస్తారు. గ్రామంలో రావణాసురుడికి గుడి కూడా ఉంది. దసరా పండుగ రోజున దేశం మొత్తం రావణాసురుడి బొమ్మను దహనం చేస్తారు. కానీ, ఈ గ్రామంలో పండుగ రోజున రావణుడిని అవమానించేలా ఎలాంటి కార్యక్రమాలు చేయరు. తమ పూర్వీకుడైన రావణాసురుడి ఆత్మకు శాంతి చేకూరాలని పిండ ప్రదానం, ప్రత్యేక యజ్ఞాలు నిర్వహిస్తారు.


ravanasura.jpg


గతంలో కొందరు గ్రామస్థులు సంప్రదాయాన్ని కాదని దసరా రోజున రావణుడి బొమ్మను దహనం చేశారు. రావణుడి బొమ్మలు దహనం చేసిన కుటుంబాల్లో తీవ్ర నష్టాలు, మరణాలు సంభవించాయని గ్రామస్థులు అంటున్నారు. ఆ భయం వల్ల ఇప్పటికీ ఎవరూ రావణ దహనం చేసే సాహసం చేయటం లేదట. అంతేకాదు.. రావణ వధ తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు దేశమంతా దీపావళి జరుపుకుంటుంది. కానీ, బిశ్రఖ్ గ్రామంలో రావణుడు మరణించినందుకు దీపావళి రోజున ఎలాంటి దీపాలు వెలిగించరు.. బాణసంచా కాల్చరు.


ravanasura-1.jpg


ఇవి కూడా చదవండి

పార్లమెంట్ మోదీ ప్రభుత్వానికి ఒక ఆటస్థలంగా మారింది: మల్లు రవి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతి పట్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన

Updated Date - Aug 04 , 2026 | 01:03 PM