స్వదేశానికి ఇరాన్ నావికా సిబ్బంది!
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:23 AM
భారత తీరంలో నిలిచిపోయిన ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ లావన్‌లోని 183 మంది నౌకాదళ సిబ్బందిని స్వదేశానికి పంపే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
ఐరిస్ లావన్‌లోని 183 మందిని పంపే ప్రయత్నాలు
న్యూఢిల్లీ, మార్చి 13: భారత తీరంలో నిలిచిపోయిన ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ లావన్‌లోని 183 మంది నౌకాదళ సిబ్బందిని స్వదేశానికి పంపే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మార్చి నాలుగో తేదీ నుంచి ఈ నౌక కొచ్చి తీరంలో నిలిచిపోయింది. విశాఖపట్నంలో జరిగిన మిలాన్-2026 విన్యాసాలకు వచ్చిన మూడు ఇరాన్ యుద్ధ నౌకల్లో ఐరిస్ లావన్ ఒకటి. ఇవి తిరిగి వెళ్లే సమయంలోనే యుద్ధం మొదలవడంతో ఈ మూడు నౌకలను భారత్‌లోనే ఉండనివ్వాలని ఇరాన్ విజ్ఞప్తి చేసింది. అయితే, వీటిలో ఐరిస్ బష్‌హర్ శ్రీలంకలో ఆగిపోయింది. ఇందులోని సిబ్బంది కూడా శ్రీలంకలోనే ఆశ్రయం పొందుతున్నారు. మరో నౌక ఐరిస్ దేనా అంతర్జాతీయ జలాల్లో మునిగిపోయింది. ఐరిస్ లావన్ ఒక్కటే సాంకేతిక ఇబ్బందులు ఎదురై మార్చి నాలుగో తేదీ నుంచి కొచ్చి తీరంలో ఉండిపోయింది. ఇందులోని 183 మంది సిబ్బంది అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.