భారత ప్రజలకు ఇరాన్ ‘క్షిపణులపై’ కృతజ్ఞతలు
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:29 AM
అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఇరాన్.. తనకు నైతిక మద్దతు ఇచ్చిన దేశాలకు సరికొత్తగా కృతజ్ఞతలు తెలిపింది..
న్యూఢిల్లీ, మార్చి27: అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఇరాన్.. తనకు నైతిక మద్దతు ఇచ్చిన దేశాలకు సరికొత్తగా కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరాన్ వైమానిక దళం సిబ్బంది ఇజ్రాయెల్‌పై ప్రయోగించేందుకు సిద్ధం చేసిన క్షిపణిపై ‘భారత ప్రజలకు కృతజ్ఞతలు’ అని మార్కర్ పెన్‌తో రాశారు. పాకిస్థాన్, జర్మనీ, స్పెయిన్‌లకు కూడా ఇలాగే ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆ క్షిపణిని ప్రయోగించారు. మార్కర్‌తో క్షిపణిపై ఓ సైనికుడు ఈ సందేశం రాస్తున్న వీడియోను ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ శుక్రవారం సోషల్‌మీడియాలో ఉంచింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో నివాసాలు సహా సర్వస్వం కోల్పోయిన ఇరాన్ ప్రజల కోసం మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో విరాళాలు సేకరించి పంపుతున్నారు. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది.