ఆయనకు చరిత్ర తెలిసి ఉంటే.. వెళ్లేవారు కాదు!
ABN , Publish Date - May 26 , 2026 | 04:05 AM
భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి రుబియో సతీసమేతంగా సోమవారం ఉదయం తాజ్‌మహల్‌ను సందర్శించి, అక్కడ...
రుబియో తాజ్‌మహల్ సందర్శనపై ఇరాన్ ఎంబసీ
న్యూఢిల్లీ, మే 25: భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి రుబియో సతీసమేతంగా సోమవారం ఉదయం తాజ్‌మహల్‌ను సందర్శించి, అక్కడ ఫొటోలు దిగటంపై హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం విమర్శలు గుప్పించింది. ‘తాజ్‌మహల్ చరిత్ర గురించి, నిర్మాణ శైలి గురించి తెలిసి ఉంటే ఆయన అక్కడికి వెళ్లి ఫొటోలు దిగేవారు కాదు’’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఎంబసీ ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘‘ఇరాన్‌కు చెందిన తన సతీమణిపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా మొఘల్ చక్రవర్తి ఈ కళాఖండాన్ని నిర్మింపజేశారు. దీనికి ప్రాణం పోసింది అద్భుతమైన ఇరాన్ శిల్పలు’ అని తెలిపింది.