ఈ క్రిమినల్స్‌ను గుర్తుంచుకోండి
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:20 AM
మినాబ్‌లోని పాఠశాలపై క్షిపణులతో దాడి జరిపి దాదాపు 175 మంది మృతిచెందడానికి ఇద్దరు అమెరికా నేవీ అధికారులే బాధ్యులని ఇరాన్ బహిరంగంగా ఆరోపించింది.
మినాబ్ స్కూల్‌పై క్షిపణి దాడికి వీరే కారకులు
అమెరికా నేవీ అధికారుల ఫొటోలు విడుదల
న్యూఢిల్లీ, మార్చి 29: మినాబ్‌లోని పాఠశాలపై క్షిపణులతో దాడి జరిపి దాదాపు 175 మంది మృతిచెందడానికి ఇద్దరు అమెరికా నేవీ అధికారులే బాధ్యులని ఇరాన్ బహిరంగంగా ఆరోపించింది. అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్ స్ర్పుయాన్స్ కమాండింగ్ ఆఫీసర్ లీ ఆర్ టేట్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ ఈ యార్క్ ఫొటోలను భారత్, దక్షిణాఫ్రికా, నైజీరియాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ‘ఎక్స్’లో విడుదల చేశాయి. ‘‘ఈ ఇద్దరు క్రిమినల్స్‌ను గుర్తుంచుకోండి. మినాబ్‌లోని బాలికల పాఠశాలపై తొమహాక్ క్షిపణిని మూడుసార్లు ప్రయోగించడానికి వీరు అనుమతి ఇచ్చారు. అభం శుభం తెలియని 168మంది చిన్నారులు మరణించడానికి కారకులయ్యారు’’ అని అధికారులు ఆరోపించారు. తమ చర్యలను వీరు ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు.