‘బాలిక హత్య’ ప్రెస్‌మీట్‌లో ఐపీఎస్‌ల నవ్వులు!
ABN , Publish Date - May 26 , 2026 | 04:03 AM
తమిళనాడులో పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడి, హత్య చేసిన ఘటనపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐపీఎస్...
కఠిన చర్యలకు నెటిజన్ల డిమాండ్
కోయంబత్తూరు, మే 25: తమిళనాడులో పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడి, హత్య చేసిన ఘటనపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐపీఎస్ అధికారులు పగలబడి నవ్వుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఇదే కేసుపై విలేకరులు ప్రశ్నించినప్పుడు మహిళా మంత్రి నవ్విన ఘటనపై ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. తాజాగా ఐపీఎ్‌సలు విరగబడి నవ్వుతున్న వీడియోలు వెలుగులోకి రావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. కోయంబత్తూరు జిల్లా సూళ్లూరు పట్టణంలో ఈనెల 21న ఇంటిముందు ఆడుకుంటున్న పదేళ్ల బాలికను దుండగులు కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారు. ఈ కేసులో నిందితులు కార్తి, మోహన్‌రాజ్‌లను పోలీసులు అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశారు. ఆ సందర్భంగా సీనియర్ ఐపీఎస్ అధికారులైన వెస్ట్ జోన్ ఐజీ ఆర్‌వీ రమ్య భారతి, కోయంబత్తూరు రేంజ్ డీఐజీ పి.స్వామినాథన్, కోయంబత్తూరు ఎస్పీ పవన్ కుమార్ రెడ్డి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో రమ్య భారతి పదేపదే విరగబడి నవ్వడం, దీంతో పక్కనున్న మరో అధికారి కూడా పగలబడి నవ్వుతున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.