Share News

పాస్‌పోర్ట్‌ సేవలకు అంతర్జాతీయ టోల్‌ఫ్రీ నంబరు!

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:36 AM

దేశాల్లో నివసించే భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్తను అందించనుంది. వీరికి అవసరమైన పాస్‌పోర్టు సేవలను..

పాస్‌పోర్ట్‌ సేవలకు అంతర్జాతీయ టోల్‌ఫ్రీ నంబరు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: విదేశాల్లో నివసించే భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్తను అందించనుంది. వీరికి అవసరమైన పాస్‌పోర్టు సేవలను అందించడానికి అంతర్జాతీయ టోల్‌ఫ్రీ నంబరును ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం కింద విదేశాల్లో ఉంటున్న ఏ భారతీయ పౌరుడైనా మన దేశంలోని పాస్‌పోర్టు సేవా కేంద్రానికి ఎటువంటి కాల్‌ చార్జీలు లేకుండా నేరుగా కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక నంబరును అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం అర్హత కలిగిన టెలికాం ఆపరేటర్ల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఆ శాఖ ప్రకటన జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న, చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది భారతీయులు తరచుగా పాస్‌పోర్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటారు.

Updated Date - Feb 23 , 2026 | 01:36 AM