పాక్ నుంచి నేపాల్ మీదుగా ఢిల్లీకి ఆయుధాలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:35 AM
చైనా, తుర్కియేకు చెందిన అత్యాధునిక తుపాకులను పాకిస్థాన్ మీదుగా భారత్‌కు తరలిస్తున్న అంతర్జాతీయ ఆయుధ ముఠాను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
అంతర్జాతీయ ఆయుధ ముఠా అరెస్ట్
న్యూఢిల్లీ, మార్చి 25: చైనా, తుర్కియేకు చెందిన అత్యాధునిక తుపాకులను పాకిస్థాన్ మీదుగా భారత్‌కు తరలిస్తున్న అంతర్జాతీయ ఆయుధ ముఠాను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాలకు చెందిన 10మంది నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి 21తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో చెక్ రిపబ్లిక్ తయారీ సబ్ మెషిన్ గన్‌తో పాటు విదేశాల్లో తయారైన అత్యాధునిక సెమీ ఆటోమెటిక్ పిస్టల్స్, 200బుల్లెట్లు ఉన్నాయి.