Share News

ఇంజెక్షన్‌ రూపంలోని సౌందర్య ఉత్పత్తులు ‘కాస్మోటిక్స్‌’ కావు

ABN , Publish Date - May 22 , 2026 | 03:40 AM

ఇంజెక్షన్‌ రూపంలోని సౌందర్య ఉత్పత్తుల వినియోగానికి అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టం ప్రకారం అవి ‘కాస్మోటిక్స్‌’ అన్న నిర్వచనం పరిధిలోకి రావని తెలిపింది.

ఇంజెక్షన్‌ రూపంలోని సౌందర్య ఉత్పత్తులు ‘కాస్మోటిక్స్‌’ కావు

  • వాటిని బ్యూటీ క్లినిక్‌లు వినియోగించకూడదు: కేంద్రం

న్యూఢిల్లీ, మే 21: ఇంజెక్షన్‌ రూపంలోని సౌందర్య ఉత్పత్తుల వినియోగానికి అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టం ప్రకారం అవి ‘కాస్మోటిక్స్‌’ అన్న నిర్వచనం పరిధిలోకి రావని తెలిపింది. అందువల్ల వాటిని బ్యూటీ క్లినిక్‌లు, వెల్‌నెస్‌ కేంద్రాలు ఉపయోగించకూడదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ) ప్రకటన జారీచేసింది. ఇంజెక్షన్‌ రూపంలో ‘కాస్మోటిక్‌ ట్రీట్‌మెంట్‌’ చేస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు వెల్లువెత్తుతున్న దృష్ట్యా ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. సర్జరీ కాని రీతిలో ఇంజెక్షన్ల రూపంలో చికిత్సలు చేస్తామంటూ కొన్ని బ్యూటీ క్లినిక్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మకూడదని తెలిపింది. వినియోగదారుల రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సురక్షితం కాని ఉత్పత్తులు, నియంత్రణ ఉన్న ఉత్పత్తుల జాబితాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని పరిశీలించాలని సూచించింది. వీటిని ఉల్లంఘించే బ్యూటీ క్లినిక్‌లపై ఫిర్యాదు చేయాలని వినియోగదారులను కోరింది.

Updated Date - May 22 , 2026 | 03:40 AM