Share News

ఇన్ఫోసిస్‌ ఉన్నతాధికారి గల్లంతు!

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:58 AM

నేపాల్‌ వరదల్లో గల్లంతైన వారిలో ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈవో లక్ష్మీనాథ్‌ గోపిశెట్టి ఉన్నారని ఆ సంస్థ శనివారం వెల్లడించింది.

ఇన్ఫోసిస్‌ ఉన్నతాధికారి గల్లంతు!

ఇంటర్నెట్ విభాగం: నేపాల్‌ వరదల్లో గల్లంతైన వారిలో ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈవో లక్ష్మీనాథ్‌ గోపిశెట్టి ఉన్నారని ఆ సంస్థ శనివారం వెల్లడించింది. వ్యక్తిగత పనిమీద నేపాల్‌ వెళ్లిన లక్ష్మీనాథ్‌ను సంప్రదించలేకపోతున్నామని తెలిపింది. ఆయన ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, వారి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. ఐబీఎం, హెచ్‌సీఎల్‌, యాక్సెంచర్‌ వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేసిన లక్ష్మీనాథ్‌.. ఇన్ఫోసి్‌సలో తొలుత గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈవోగా ఉన్నారు. ఇక నేపాల్‌-చైనా సరిహద్దుల్లోని గ్యిరోంగ్‌ వద్ద గల్లంతైన ఈశా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. ఆ బృందంలో భారత్‌తోపాటు 19 దేశాలకు చెందినవారు ఉన్నారని, ఒక్కరి జాడ కూడా దొరకలేదని ఈశా ఫౌండేషన్‌ వెల్లడించింది.

Updated Date - Aug 30 , 2026 | 06:00 AM