‘బ్రహ్మోస్’ కొనుగోలుకు ఇండోనేషియా డీల్
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:57 AM
భారత దేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి....
జకార్తా, మార్చి 9: భారత దేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి రికో రికార్డో సిరాయత్ సోమవారం ప్రకటించారు. సైన్యం ఆధునికీకరణలో భాగంగా 200 మిలియన్ డాలర్ల నుంచి 350 మిలియన్ డాలర్లు (రూ.1,900 కోట్లు-రూ.3,200కోట్లు) విలువ చేసే బ్రహ్మో్‌సను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భారత్-రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. భారత్‌లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేర్లు కలిసేలా బ్రహ్మోస్ అని పేరు పెట్టారు.