Share News

ఈ నెల 10 తర్వాత విమానాలు రద్దు చేయం

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:29 AM

విమాన డ్యూటీ కాల పరిమితి (ఎఫ్‌డిటిఎల్‌) నిబంధనల అమలుకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్రానికి ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో తెలిపినట్లు సమాచారం.

ఈ నెల 10 తర్వాత విమానాలు రద్దు చేయం

  • డీజీసీఏ అధికారులకు చెప్పిన ఇండిగో

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): విమాన డ్యూటీ కాల పరిమితి (ఎఫ్‌డిటిఎల్‌) నిబంధనల అమలుకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్రానికి ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో తెలిపినట్లు సమాచారం. తమ వద్ద తగిన సంఖ్యలో పైలట్లు ఉన్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘ఎఫ్‌డిటీఎల్‌’ నిబంధనలను అమలు చేయడానికి ఇండిగోకు ఈ నెల 10 వరకు కేంద్రం గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండిగోతో అనుసరించాల్సిన వ్యూహంపై డీజీసీఏతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు చర్చించారు. తమ వద్ద తగిన సంఖ్యలో పైలట్లు ఉన్నారని డీజీసీఏకు చెప్పిన ఇండిగో..ఈ నెల 10 తర్వాత విమానాలను రద్దు చేయబోమని తెలిపినట్లు సమాచారం. గతేడాది డిసెంబరులో తీవ్ర ఆలస్యం, విమానాల రద్దుతో సంక్షోభానికి కారణమైనందుకు ఇండిగోపై కేంద్రం రూ.22.20 కోట్ల జరిమానా విధించింది.

Updated Date - Feb 10 , 2026 | 03:29 AM