Share News

అమెరికాతో వాణిజ్య ఒప్పందం జూలైలో ఖరారు!

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:01 AM

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ త్వరలోనే అమల్లోకి రానుంది. జూలైలో ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశం...

అమెరికాతో వాణిజ్య ఒప్పందం జూలైలో ఖరారు!

  • కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 8: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ త్వరలోనే అమల్లోకి రానుంది. జూలైలో ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలను సత్వరమే పరిష్కరించుకోవడానికి ఇరు దేశాలు వేగంగా కృషి చేస్తున్నాయన్నారు. జూలై రెండో వారం నాటికి ఒప్పందం తొలి విడతను అమలు చేసే స్థితికి చేరుకుంటామని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతిదారులకు ఇతర పోటీ దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్లో ప్రాధాన్య ప్రవేశం లభిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చలు పురోగతిలో ఉన్నాయని.. ఈ నెలాఖరులో అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్‌కు వచ్చే అవకాశం ఉందని గోయల్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 04:01 AM