Share News

ఖమేనీ మరణంపై స్పందించని భారత్‌

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:24 AM

అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంపై భారత్‌ స్పందించలేదు. ఖండన ప్రకటన కూడా చేయలేదు...

ఖమేనీ మరణంపై స్పందించని భారత్‌

  • గతంలో భారత అంతర్గత విషయాల్లో ఖమేనీ జోక్యం

న్యూఢిల్లీ, మార్చి 2: అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంపై భారత్‌ స్పందించలేదు. ఖండన ప్రకటన కూడా చేయలేదు. దీనికి ఖమేనీ గతంలో అనేకసార్లు భారత అంతర్గత విషయాలపై జోక్యం చేసుకోవడమే కారణమని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. గత మూడు దశాబ్దాల్లో అనేకసార్లు భారత్‌ను ఇబ్బందిపెట్టేలా వ్యాఖ్యానించడమే కారణమంటున్నాయి. 1994 నుంచి 2024 వరకు అనేక సందర్భాల్లో ఖమేనీ భారత అంతర్గత విషయాలపై విమర్శలు చేశారు. 2017లో ఖమేనీ కశ్మీర్‌ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ను గాజా, అఫ్ఘానిస్థాన్‌తో పోల్చారు. కశ్మీరీ ముస్లింలు అణచివేతకు గురవుతున్నారన్నారు. ఇది భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనని భారత విదేశాంగ శాఖ అప్పట్లోనే విమర్శించింది. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌ కశ్మీర్‌ విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తోందని ఖమేనీ వ్యాఖ్యానించారు. 2024లో పౌరసత్వ సవరణ చట్టం సమయంలో ఖమేనీ సోషల్‌ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు అప్పట్లో కలకలం రేపాయి.

Updated Date - Mar 03 , 2026 | 04:24 AM