భారత్‌లో తొలి గో సంస్కృతి మ్యూజియం
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:01 AM
శాస్త్రపరంగా గో ఉత్పత్తుల విశిష్టతను తెలియచెప్పే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ మథురలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వెటెర్నరీ సైన్స్ యూనివర్సిటీ క్యాంప్‌సలో..
మథుర, ఫిబ్రవరి 15: శాస్త్రపరంగా గో ఉత్పత్తుల విశిష్టతను తెలియచెప్పే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ మథురలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వెటెర్నరీ సైన్స్ యూనివర్సిటీ క్యాంప్‌సలో గో సంస్కృతి మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. బ్రజ్ తీర్థ్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశంలోనే ఈ తరహాలో ఏర్పాటు చేసే తొలి మ్యూజియం ఇది. వందకు పైగా దేశవాలీ ఆవుల మోడల్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇదే చోట ఓ డైరీ పార్లర్ కూడా ఏర్పాటు చేసి ఆవు పాలు, పెరుగు, నెయ్యితో పాటు ఇతర గో ఉత్పత్తులను సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉంచుతారు. గో ఉత్పత్తులతో కలిగే లాభాలను శాస్త్రపరంగా వివరిస్తారు.