Share News

గరిష్ఠ స్థాయిలో ఎరువుల నిల్వలు

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:29 AM

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన ఎరువుల నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు...

గరిష్ఠ స్థాయిలో ఎరువుల నిల్వలు

  • 177.31 లక్షల టన్నులు నిల్వ ఉన్నాయి

  • రైతులు ఆందోళన చెందవద్దు: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 6: వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన ఎరువుల నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, హోర్ముజ్‌ జలసంధి మూసివేత ప్రభావం ఎరువుల సరఫరాపై ఏమాత్రం ఉండబోదని తెలిపింది. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు వివిధ ఎరువుల నిల్వల వివరాలను కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. మొత్తం ఎరువులన్నీ కలిపి ప్రస్తుతం 177.31 లక్షల టన్నుల నిల్వ ఉందని, ఇది గతేడాది నిల్వ 129.85 లక్షల టన్నుల కన్నా 36.5ు అధికమని తెలిపింది. పంటల సాగులో అత్యధికంగా వినియోగించే, సహజ వాయు ఫీడ్‌స్టాక్‌పై ఆధారపడే యూరియా 59.30 లక్షల టన్నుల నిల్వ ఉందని, డీఏపీ 25.13 లక్షల టన్నులు, ఎన్‌పీకే ఎరువులు 55.87 లక్షల టన్నులు నిల్వ ఉన్నాయని వెల్లడించింది. అంతేకాకుండా ఫిబ్రవరి నాటికే 98 లక్షల టన్నుల ఫినిష్డ్‌ ఎరువులను ప్రభుత్వం దిగుమతి చేసుకుందని, వచ్చే మూడు నెలల్లో మరో 17 లక్షల టన్నులు రానుందని పేర్కొంది. రైతులే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఎరువుల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

Updated Date - Mar 07 , 2026 | 04:29 AM