ఇదివరకెన్నడూ లేనంతటి కష్టకాలమిది
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:51 AM
ఇంధన సరఫరాలో ఇదివరకెన్నడూ లేనంతటి కష్టకాలం నడుస్తోందని, ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని కేంద్ర పెట్రోలియం...
దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయి
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి
న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఇంధన సరఫరాలో ఇదివరకెన్నడూ లేనంతటి కష్టకాలం నడుస్తోందని, ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పీజీ కొరత లేనేలేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎలాంటి ఆందోళనా అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో వంట గ్యాస్ సంక్షోభంపై గురువారం పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసనల మధ్య హర్దీప్ సింగ్ అధికారిక ప్రకటన చేశారు. గతంలో గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు 60ు ఎల్పీజీ దిగుమతులు వచ్చేవని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. హోర్ముజ్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం 70 శాతం క్రూడ్ దిగుమతులు మనకు లభిస్తున్నాయని చెప్పారు. 2006-07లో 27 దేశాల నుంచి మనకు దిగుమతులు వచ్చేవని, ఇప్పుడు 40 దేశాల నుంచే వస్తున్నాయన్నారు. ఇంధన లభ్యత స్థిరంగా ఉందని, బుక్ చేసిన రెండున్నర రోజుల్లో ఎల్పీజీ సిలిండర్లు యథాప్రకారం లభిస్తాయని చెప్పారు.