Share News

దానగుణ సంపన్నులు భారతీయులు

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:20 AM

దేశంలో సంపన్నులేనా?...లేదంటే సామాన్యులు, సాధారణ గృహస్థులు కూడా దానధర్మాలు చేస్తున్నారా? ఎందుకు చేయడం లేదు? ఏటా రూ.54వేల కోట్ల మేర దానం చేస్తున్నారు

దానగుణ సంపన్నులు భారతీయులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశంలో సంపన్నులేనా?...లేదంటే సామాన్యులు, సాధారణ గృహస్థులు కూడా దానధర్మాలు చేస్తున్నారా? ఎందుకు చేయడం లేదు? ఏటా రూ.54వేల కోట్ల మేర దానం చేస్తున్నారు. ఇందులో 45.9 శాతం మత సంస్థలకు అందిస్తుంటే 41.8 శాతం బిచ్చగాళ్లకు ఇస్తున్నారు. నెలకు కేవలం నాలుగయిదు వేల రూపాయలు ఖర్చు పెట్టగలిగే వారు కూడా తమకు ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేస్తున్నారు. అందువల్లనే ప్రపంచంలోనే దాణగుణం ఉన్న ప్రజలుగా భారతీయులు గుర్తింపు పొందారు. ‘భారత దేశం ఎలా ఇస్తోంది..’ పేరుతో అశోకా విశ్వవిద్యాలయం పరిధిలోని సీఎ్‌సఐపీ అనే విభాగం నిర్వహించిన మూడో విడత సర్వేలో ఈ విషయం వెల్లడయింది. శ్రమదానం, స్వచ్ఛంద సేవల ద్వారా తమ వంతు సాయం చేస్తామని 30ు మంది చెప్పడం గమనార్హం. వ్యక్తిగతంగా కలిసి మాట్లాడడం వల్లనే ఎక్కువ విరాళాలు వస్తున్నాయి. 25ు ఈ రూపంలోనే వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో సమాచారం పెడుతుంటే 15ు వస్తున్నాయి.

Updated Date - Feb 21 , 2026 | 12:20 AM