Share News

రూ.7,744 కోట్ల ప్యాకేజీ!

ABN , Publish Date - Jun 28 , 2026 | 04:15 AM

అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ రియల్‌ ఎస్టేట్‌ వెల్‌టవర్‌ సీఈవో, భారత సంతతికి చెందిన శంఖ్‌ మిత్ర ప్రపంచంలోనే రెండవ అత్యధిక వార్షిక...

రూ.7,744 కోట్ల ప్యాకేజీ!

  • భారత సంతతికి చెందిన వెల్‌టవర్‌ సంస్థ సీఈవో శంఖ్‌మిత్ర వార్షిక వేతనం ఇది

  • మస్క్‌ తర్వాత రెండో అత్యధిక ప్యాకేజీ

న్యూఢిల్లీ, జూన్‌ 27: అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ రియల్‌ ఎస్టేట్‌ వెల్‌టవర్‌ సీఈవో, భారత సంతతికి చెందిన శంఖ్‌ మిత్ర ప్రపంచంలోనే రెండవ అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు. ‘ది వాల్‌ స్ట్రీట్‌’ నివేదిక ప్రకారం 2025లో ఆయనకు లభించిన ప్యాకేజీ విలువ 821 మిలియన్‌ డాలర్లు. అంటే సుమారు రూ.7,744 కోట్లు! 158 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీతో ఎలాన్‌ మస్క్‌ మొదటి స్థానంలో ఉండగా శంఖ్‌ మిత్ర రెండో స్థానం దక్కించుకున్నారు. మిత్ర ప్యాకేజీలో ఎక్కువ భాగం కంపెనీల షేర్ల రూపంలోనే ఉంటుంది. అక్టోబరులో ఆయనకు లభించిన 789 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు, కంపెనీ స్టాక్‌ పనితీరు కారణంగా ఏడాది చివరి నాటికి బిలియన్‌ డాలర్లకు పైగా దాటాయి. శంఖ్‌ మిత్ర 2031 వరకు కంపెనీలో కొనసాగితేనే సగం షేర్లు అందుతాయి. మిగిలిన సగం షేర్లు కంపెనీ మార్కెట్‌ విలువను 45ు పెంచడం వంటి కఠిన లక్ష్యాలను సాధించడంపై ఆధారపడి ఉంటాయి. శంఖ్‌ మిత్ర కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. 2016లో వెల్‌టవర్‌లో చేరిన ఆయన 2020లో ఆ సంస్థకు సీఈవోగా అయ్యారు.

Updated Date - Jun 28 , 2026 | 04:15 AM