కువైట్‌పై ఇరాన్ దాడిలో రామనాధపురం వ్యక్తి మృతి
ABN , Publish Date - Apr 01 , 2026 | 03:45 AM
కువైట్‌పై ఇరాన్ డ్రోన్లతో దాడిచేసిన ఘటనలో తమిళనాడులోని రామనాధపురం జిల్లా అనికురుందన్ గ్రామానికి చెందిన సంతానం సెల్వం...
చెన్నై, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కువైట్‌పై ఇరాన్ డ్రోన్లతో దాడిచేసిన ఘటనలో తమిళనాడులోని రామనాధపురం జిల్లా అనికురుందన్ గ్రామానికి చెందిన సంతానం సెల్వం (36) అనే వ్యక్తి మృతి చెందాడు. సంతానం పదేళ్లుగా కువైట్‌లోని ఓ సంస్థలో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 10 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి, విధులకు వెళ్లాడు. ఇరాన్ దాడి వల్ల భవనం కూలడంతో సంతానం మృతి చెందాడంటూ సోమవారం రాత్రి అతని కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారం చేరవేశారు. బుధవారం సంతానం మృతదేహం స్వగ్రామానికి పంపిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు.