వచ్చే వారం మళ్లీ గాల్లోకి తేజస్ యుద్ధ విమానాలు!
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:42 AM
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధ విమానాలు వచ్చే వారం నుంచి మళ్లీ సేవల్లోకి రానున్నాయి. ఫిబ్రవరిలో ఓ ఫార్వర్డ్ బేస్ వద్ద జరిగిన ప్రమాదంలో పైలట్ గాయపడిన నేపథ్యంలో భారత వైమానిక దళాని....
ఫిబ్రవరిలో ఓ ప్రమాదంతో తాత్కాలికంగా నిలిపివేత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధ విమానాలు వచ్చే వారం నుంచి మళ్లీ సేవల్లోకి రానున్నాయి. ఫిబ్రవరిలో ఓ ఫార్వర్డ్ బేస్ వద్ద జరిగిన ప్రమాదంలో పైలట్ గాయపడిన నేపథ్యంలో భారత వైమానిక దళాని(ఐఏఎఫ్)కి చెందిన 34 తేజస్ ఎంకే-1 విమానాల సేవలను సాధారణ నిర్వహణ తనిఖీల కోసం తాత్కాలికంగా నిలిపేశారు. ఈ విమానాల బ్రేకింగ్ వ్యవస్థలో సమస్యను గుర్తించి.. సరిచేసినట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తెలిపింది. ఇక అధునాతన తేజస్ ఎంకే-1ఏ విమానాల డెలివరీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశముంది. ఎందుకంటే హెచ్‌ఏఎల్ మొదట పెండింగ్‌లో ఉన్న రెండు కీలక పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది. ఇటు అమెరికా సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) నుంచి రావాల్సిన ఎఫ్-404 ఇంజన్ల సరఫరాలోనూ జాప్యం జరుగుతోంది.