Share News

రైల్లో మొబైల్‌ స్పీకర్‌ ఆన్‌ చేస్తే జైలు!

ABN , Publish Date - Oct 20 , 2026 | 06:27 AM

ఇకమీదట రైలులో ప్రయాణించేటపుడు మొబైల్‌ ఫోన్‌లో వీడియోలు చూడాలన్నా లేదా పాటలు వినాలన్నా కచ్చితంగా ఇయర్‌ఫోన్స్‌ వాడాల్సిందే.

రైల్లో మొబైల్‌ స్పీకర్‌ ఆన్‌ చేస్తే జైలు!

  • ట్రైన్స్‌, రైల్వేస్టేషన్లలో పెద్ద శబ్దంతో వీడియోలు, పాటలు ప్లే చేస్తే 1000 జరిమానా

  • దక్షిణాది రైల్వే మార్గదర్శకాలు జారీ

న్యూఢిల్లీ, అక్టోబరు 19: ఇకమీదట రైలులో ప్రయాణించేటపుడు మొబైల్‌ ఫోన్‌లో వీడియోలు చూడాలన్నా లేదా పాటలు వినాలన్నా కచ్చితంగా ఇయర్‌ఫోన్స్‌ వాడాల్సిందే. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ఎవరైనా మొబైల్‌ ఫోన్‌ స్పీకర్లు ఆన్‌ చేసి పెద్ద శబ్దంతో వీడియోలు చూడటం లేదా పాటలు వినడం లేదా బిగ్గరగా మాట్లాడినా జరిమానా తప్పదు. మొదటిసారి దొరికితే 1000 రూపాయలు జరిమానా వేస్తారు. పదేపదే ఇబ్బందులు కలిగిస్తే రూ.5000 జరిమానాతో పాటు 6 నెలలు జైలు శిక్ష కూడా తప్పదు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో మొబైల్‌ ఫోన్స్‌ స్పీకర్ల వాడకాన్ని అరికట్టేందుకు దక్షిణాది రైల్వే ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా ఇయర్‌ఫోన్స్‌ వాడాలని ప్రయాణికులను కోరింది. మొబైల్‌ ఫోన్‌ స్పీకర్లు ఆన్‌ చేయడం వల్ల ఇతర ప్రయాణికుల విశ్రాంతికి, ప్రయాణానికి అసౌకర్యం ఏర్పడుతుందని పేర్కొంది. ప్రకటనలు, నోటీసుల ద్వారా ప్రయాణికుల్లో ఈ మేరకు అవగాహన కల్పించాలని రైల్వే డివిజన్లకు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Oct 20 , 2026 | 06:33 AM