రైళ్లలో మరింత భద్రంగా సరకు రవాణా
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:03 AM
సరకు రవాణా భద్రతను మెరుగుపరిచేందుకు, అలాగే గూడ్స్ వ్యాగన్ల తనిఖీని వేగవంతం, మరింత విశ్వసనీయం చేసేందుకు భారత రైల్వేశాఖ కృత్రిమ మేధ ఆధారంగా..
కొత్తగా కృత్రిమ మేధ వ్యవస్థను తీసుకొచ్చిన భారత రైల్వే
వ్యాగన్ల డోర్లు, లాక్‌లు, సీల్‌ల తనిఖీకి ‘ప్రాజెక్ట్ దృష్టి’
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: సరకు రవాణా భద్రతను మెరుగుపరిచేందుకు, అలాగే గూడ్స్ వ్యాగన్ల తనిఖీని వేగవంతం, మరింత విశ్వసనీయం చేసేందుకు భారత రైల్వేశాఖ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రాజెక్టు దృష్టిగా పేర్కొంటున్న ఈ వ్యవస్థను ఐఐటీ-గువాహటీ సహకారంతో నార్తీస్ట్ ఫ్రాంటీర్ రైల్వే(ఎన్‌ఎ్‌ఫఆర్) రూపొందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా గూడ్స్ వ్యాగన్ల డోర్లు, లాక్‌లు, సీల్‌లను కృత్రిమ మేధ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఒక పర్యవేక్షణ కేంద్రం గుండా గూడ్స్ రైలు ప్రయాణిస్తున్నప్పుడు వ్యాగన్లను ఈ ప్రాజెక్టులోని కెమేరాలు ఫొటోలు తీస్తాయి. ఆ తర్వాత ఆ ఫొటోలను కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థ విశ్లేషిస్తుంది. వ్యాగన్ డోర్లు, లాక్‌లు, సీల్‌లు ఎలా ఉన్నాయో పరిశీలిస్తుంది. ఈ తనిఖీలో గుర్తించిన అంశాలను డిజిటల్‌గానూ రికార్డు చే స్తుంది. దీంతో రైల్వే సిబ్బంది వాటిని గుర్తించి, మరింత వేగవంతంగా స్పందించేందుకు అవకాశం కలుగుతుంది.