టికెట్ లేని రైలు ప్రయాణానికి ఫైన్ రెట్టింపు
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:21 AM
టికెట్ లేకుండా ప్రయాణిస్తే విధించే జరిమానాను రెట్టింపు చేసినట్టు భారత రైల్వే ప్రకటించింది. ఇంతవరకు కనీస జరిమానా కింద రూ.250 వసూలు చేస్తుండగా...
న్యూఢిల్లీ, జూన్ 20: టికెట్ లేకుండా ప్రయాణిస్తే విధించే జరిమానాను రెట్టింపు చేసినట్టు భారత రైల్వే ప్రకటించింది. ఇంతవరకు కనీస జరిమానా కింద రూ.250 వసూలు చేస్తుండగా, ఇకపై రూ.500 విధిస్తామని తెలిపింది. టికెట్‌లేని ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలతో పాటు, ఈ జరిమానాను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఒక్క సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోనే మే నెలలో 4.96 లక్షల మంది ప్రయాణికుల నుంచి రూ.40.85 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.