ఇంటి వద్దకే రైల్వే పార్శిల్స్ సేవలు
ABN , Publish Date - Oct 31 , 2026 | 03:23 AM
వినియోగదారుల ఇబ్బందులకు చెక్ పెడుతూ భారతీయ రైల్వే కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ‘ఘర్ సే ఘర్ తక్’ పేరిట దేశంలోనే తొలిసారిగా పార్శిల్ డెలివరీ సేవలను..
నగరాల్లో ‘ఘర్ సే ఘర్ తక్!’
న్యూఢిల్లీ, అక్టోబరు 30: వినియోగదారుల ఇబ్బందులకు చెక్ పెడుతూ భారతీయ రైల్వే కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ‘ఘర్ సే ఘర్ తక్’ పేరిట దేశంలోనే తొలిసారిగా పార్శిల్ డెలివరీ సేవలను నేరుగా ఇంటికే తీసుకురానుంది. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, పుణే వంటి 8 ప్రధాన నగరాల్లో ఈ సేవలు తొలిదశలో అందుబాటులోకి రానున్నాయి. ‘రైల్వే పార్శిల్ యాప్’ లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఒక్క క్లిక్‌తో ఇళ్ల నుంచే పార్శిల్ పికప్, డెలివరీ సర్వీసులను బుక్ చేసుకోవచ్చు. రైలు బయలుదేరే సమయానికి 15రోజుల ముందు నుంచి ఒకరోజు ముందు వరకు బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. లైవ్ ట్రాకింగ్‌తో పార్శిల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు.