Share News

హోర్ముజ్‌ దాటిన ఎల్‌పీజీ ట్యాంకర్‌ ‘జగ్‌ విక్రమ్‌’

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:26 AM

భారత్‌కు చెందిన ఎల్‌పీజీ ట్యాంకర్‌ జగ్‌ విక్రమ్‌ హోర్ముజ్‌ జలసంధిని దాటింది. అమెరికా, ఇరాన్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత హోర్ముజ్‌ను..

హోర్ముజ్‌ దాటిన ఎల్‌పీజీ ట్యాంకర్‌ ‘జగ్‌ విక్రమ్‌’

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: భారత్‌కు చెందిన ఎల్‌పీజీ ట్యాంకర్‌ జగ్‌ విక్రమ్‌ హోర్ముజ్‌ జలసంధిని దాటింది. అమెరికా, ఇరాన్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత హోర్ముజ్‌ను దాటిన తొలి భారత నౌక ఇదేనని షిప్‌ ట్రాకింగ్‌ గణాంకాలు వెల్లడించాయి. ఈ ట్యాంకర్‌ శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ జలసంధి మార్గంలో ప్రయాణించి, మధ్యాహ్నానికి గల్ఫ్‌ ఆఫ్‌ ఒమాన్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ ట్యాంకర్‌లో దాదాపు 20 వేల టన్నుల ఎల్‌పీజీ రవాణా అవుతోందని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి బయటకు వచ్చిన తొమ్మిదో భారతీయ నౌక జగ్‌ విక్రమ్‌ కాగా, అదే ప్రాంతంలో భారత్‌ జెండాతో ఉన్న మరో 15 నౌకలు అనుమతి కోసం వేచి ఉన్నాయి.

Updated Date - Apr 12 , 2026 | 03:26 AM