25 రోజుల తర్వాతనే సిలిండర్ రీఫిల్ బుకింగ్
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:44 AM
పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇటీవలే దేశీయ చమురు కంపెనీలు గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్...
కనీస వెయిటింగ్ పీరియడ్‌లో మార్పు
న్యూఢిల్లీ, మార్చి 9: పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇటీవలే దేశీయ చమురు కంపెనీలు గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.60 మేర పెంచాయి. రానున్న కాలంలో ఈ గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడాన్ని అరికట్టేందుకే కాకుండా వంట గ్యాస్ పంపిణీ సమానంగా ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎల్‌పీజీ సిలిండర్ రీఫిల్‌ను బుక్ చేసిన తర్వాత 21 రోజులకు మరో సిలిండర్ రీఫిల్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ కనీస వెయిటింగ్ పీరియడ్‌ను 25 రోజులకు పెంచినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.