Share News

యూఎస్‌తో ట్రేడ్ డీల్.. 99 శాతం చర్చలు పూర్తి: మంత్రి పీయూష్ గోయల్

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:18 PM

యూఎస్‌తో తొలిదశ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 99 శాతం చర్చలు పూర్తయ్యాయని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. త్వరలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదురుతుందని అన్నారు.

యూఎస్‌తో ట్రేడ్ డీల్.. 99 శాతం చర్చలు పూర్తి: మంత్రి పీయూష్ గోయల్
Piyush Goyal on India US trade deal

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో తొలి దశ త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోమవారం తెలిపారు. ఈ దిశగా చర్చలు 99 శాతం పూర్తయ్యాయని చెప్పారు. జూన్ 2-4 తేదీల్లో ఇరు దేశాల బృందాలు మిగిలిన అంశాలపై చర్చిస్తాయని చెప్పారు. చిన్న చిన్న అంశాలే మిగిలి ఉన్నాయని అన్నారు. త్వరలో తొలి దశ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేస్తామని చెప్పారు. ఆ తరువాత రెండో దశకు సంబంధించిన చర్చలు కొనసాగుతాయని అన్నారు. ఈ ఒప్పందంపై చర్చల కోసం అమెరికా బృందం ఇప్పటికే భారత్‌కు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.


వాణిజ్యానికి సంబంధించి నాన్ టారిఫ్ అడ్డంకుల తొలగింపు, పెట్టుబడులకు ప్రోత్సాహం, సప్లై చైన్‌ అంశాలకు సంబంధించిన సహకారం తదితర అంశాలపై ఇరు దేశాల బృందాలు చర్చిస్తున్నాయి. యూఎస్ ట్రేడ్ యాక్ట్ ప్రకారం విధిస్తున్న సుంకాల నుంచి రక్షణ కావాలని భారత్ ఈ చర్చల్లో భాగంగా అమెరికాను కోరుతోంది. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి గతంలోనూ చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

‘దురంధర్‌’తో పడిపోయిన ఇమేజీ.. దాడులకు ప్లాన్ చేస్తున్న డీ-కంపెనీ

ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించిన టీఎంసీ

Updated Date - Jun 01 , 2026 | 05:54 PM