Share News

అక్టోబరులో స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:26 AM

భారత్‌లో నిరుద్యోగిత రేటులో స్వల్ప మెరుగుదల కనిపించింది. సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో 5 శాతంగా..

అక్టోబరులో స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం

న్యూఢిల్లీ, నవంబరు 16: భారత్‌లో నిరుద్యోగిత రేటులో స్వల్ప మెరుగుదల కనిపించింది. సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో 5 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు అక్టోబరులో 4.9 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల శ్రమశక్తి భాగస్వామ్యం పెరగడంతో ఈ తగ్గుదల కనిపించింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ బులెటిన్‌ ప్రకారం.. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి సంబంధించిన మొత్తం నిరుద్యోగిత రేటు 2025 అక్టోబరులో నమోదైన 5.2 శాతం కంటే 0.3 శాతం తక్కువగా నమోదైంది.

Updated Date - Nov 17 , 2026 | 03:27 AM