Share News

డ్రైవింగ్‌ లైసెన్సులో గ్రేడ్లు.!

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:06 AM

బాధ్యతాయుత డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి, రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కొత్త ఆలోచన చేసింది. గ్రేడ్ల ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్సులు ..

డ్రైవింగ్‌ లైసెన్సులో గ్రేడ్లు.!

  • త్వరలోనే కొత్త విధానం: గడ్కరీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: బాధ్యతాయుత డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి, రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కొత్త ఆలోచన చేసింది. గ్రేడ్ల ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్సులు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అలాగే ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారి లైసెన్సు రద్దుతో పాటు ఇతర కఠిన నిబంధనలు ప్రవేశపెట్టనుంది. ఢిల్లీలో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, అధిక వేగం, డ్రంకెన్‌ డ్రైవ్‌ తదితర కారణాలతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. డ్రైవింగ్‌ లైసెన్సుల్లో గ్రేడింగ్‌ పాయింట్ల వ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడితే కొన్ని పాయింట్లు కోల్పోతారని, అన్ని పాయింట్లు కోల్పోతే డ్రైవింగ్‌ లైసెన్సు 6 నెలలు సస్పెండ్‌ అవుతుందని తెలిపారు. తప్పులు పునరావృతమైతే లైసెన్సు పూర్తిగా రద్దు చేస్తామని, త్వరలోనే ఈ వ్యవస్థను ప్రవేశపెడతామన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 04:06 AM