Share News

అమెరికా మినహాయింపులున్నా..లేకున్నారష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆగవు

ABN , Publish Date - May 19 , 2026 | 04:06 AM

రష్యా ముడి చమురును కొనడానికి అమెరికా ఇచ్చిన వెసులుబాటు గడువు ఈ నెల 16తో ముగిసినప్పటికీ భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపబోదని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ సోమవారం స్పష్టం చేశారు.

అమెరికా మినహాయింపులున్నా..లేకున్నారష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆగవు

  • కేంద్రం స్పష్టీకరణ..గడువును 30రోజులు పెంచిన అమెరికా

న్యూఢిల్లీ, మే 18: రష్యా ముడి చమురును కొనడానికి అమెరికా ఇచ్చిన వెసులుబాటు గడువు ఈ నెల 16తో ముగిసినప్పటికీ భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపబోదని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ సోమవారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా రష్యా చమురుపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇరాన్‌పై దాడులు, ప్రతిదాడుల వల్ల అంతర్జాతీయంగా చమురు కొరత రాకుండా అమెరికా ఈ ఆంక్షలను సడలించింది. ఏప్రిల్‌ 17కు ముందు నౌకల్లో లోడ్‌ చేసిన రష్యా చమురును ఏ దేశమైనా కొనుగోలు చేయవచ్చని, ఆంక్షలు ఉండవని ప్రకటించింది. ఇది మే 16వరకు వర్తిస్తుందని తెలిపింది. శనివారంతో ఈ గడువు ముగిసిన నేపథ్యంలో సుజాత శర్మ మీడియాతో మాట్లాడారు. ‘‘రష్యాపై ఆంక్షలు ఉన్నప్పుడూ ఆ దేశ చమురును కొన్నాం.. ఆంక్షలు సడలించాక కూడా కొన్నాం.. ఇక ముందు కూడా రష్యా చమురును భారత్‌ కొంటుంది’’ అని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఈ మినహాయింపులను అమెరికా మరో 30రోజల పాటు పొడిగించింది. అమెరికా వాణిజ్యమంత్రి బెస్సెంట్‌ ఈ మేరకు సోమవారం రాత్రి ప్రకటించారు.

Updated Date - May 19 , 2026 | 04:06 AM