Share News

సరిహద్దులకు ‘వజ్ర’కవచం

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:58 AM

చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో శత్రు సైన్యాల దాడిని తిప్పికొట్టేందుకు భారీ రక్షణ ఒప్పందానికి సిద్ధమైంది. రూ.23 వేల కోట్లతో అదనంగా మరో ...

సరిహద్దులకు ‘వజ్ర’కవచం

  • 23 వేల కోట్లతో 300 కే9 వజ్ర-టి డీల్‌కు సన్నాహం

న్యూఢిల్లీ, జూన్‌ 10: చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో శత్రు సైన్యాల దాడిని తిప్పికొట్టేందుకు భారీ రక్షణ ఒప్పందానికి సిద్ధమైంది. రూ.23 వేల కోట్లతో అదనంగా మరో 300 కే9 వజ్ర-టి సెల్ఫ్‌-ప్రొపెల్లెడ్‌ హౌవిట్జర్లను కొనుగోలు చేయనుంది. దీనిపై త్వరలో జరిగే డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ బోర్డు(డీపీబీ)లో చర్చించే అవకాశం ఉంది. వైవిధ్యమైన భౌగోళిక ప్రాంతాల్లో కే9 వజ్ర సామర్థ్యం చూశాక వీటి సంఖ్యను మరింత పెంచాలని ఆర్మీ నిర్ణయించింది. మొదట ఈ ఆర్టిలరీ వ్యవస్థను ఎడారుల్లో యుద్ధ పరిస్థితుల కోసం కొనుగోలు చేశారు. తర్వాత తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దులో ఉన్న ఎత్తైన మంచుకొండల్లోనూ ఇవి సమర్థంగా పనిచేశాయి. ప్రస్తుతం సైన్యం వద్ద 100 కే9 వజ్ర గన్స్‌ ఉండగా, 2024లో రూ. 7,629 కోట్లతో మరో 100 కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. 155 ఎంఎం/52 క్యాలిబర్‌ కలిగిన ట్రాక్డ్‌ సెల్ఫ్‌ ప్రొపెల్లెడ్‌ కే9 వజ్ర-టి ఫిరంగులను దక్షిణ కొరియా సంస్థ హన్వా ఏరోస్పే్‌సతో కలిసి లార్సెన్‌ అండ్‌ టూబ్రో సంస్థ భారత్‌లో తయారు చేస్తుంది.

Updated Date - Jun 11 , 2026 | 03:58 AM