Share News

యుద్ధం వేళ జల రవాణాకు కేంద్ర ప్రభుత్వం అండ

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:29 AM

హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ కట్టడి చేయడంతో జల రవాణాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ స్థితిలో సముద్రంలోని మన నౌకలు తిరిగి వచ్చేందుకు...

యుద్ధం వేళ జల రవాణాకు కేంద్ర ప్రభుత్వం అండ

న్యూఢిల్లీ, మార్చి 18: హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ కట్టడి చేయడంతో జల రవాణాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ స్థితిలో సముద్రంలోని మన నౌకలు తిరిగి వచ్చేందుకు అనుమతిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నౌకలు వివిధ పోర్టులకు సురక్షితంగా చేరుకునేందుకు సహకరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా, సుంకాలు, రవాణా పరంగా అండగా నిలవాలని నిశ్చయించింది. ఇందులోభాగంగా స్టోరేజీ వ్యయాలను సరళతరం చేయనుంది. ముందుగా అనుమతించిన పోర్టుకు చేరడం వీలుకాని పరిస్థితి ఉన్నా, బుకింగ్‌ రద్దు అయినా మరో పోర్టును కొత్తగా (ఫ్రెష్‌ సీ అరైవల్‌ మ్యానిఫె్‌స్ట్స-ఎ్‌సఎఎమ్‌) ఎంచుకునే వెసులుబాటును ఇవ్వనుంది. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఇవి కూడా చదవండి..

అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..

మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 19 , 2026 | 06:29 AM