Share News

రక్షణ శాఖ.. 5,083 కోట్ల ఒప్పందాలు

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:23 AM

కేంద్ర రక్షణ శాఖ మంగళవారం ఆరు అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌), ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే....

రక్షణ శాఖ.. 5,083 కోట్ల ఒప్పందాలు

న్యూఢిల్లీ, మార్చి 3: కేంద్ర రక్షణ శాఖ మంగళవారం ఆరు అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌), ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే ‘ష్టిల్‌’ క్షిపణుల కొనుగోలుకు సంబంధించి రూ.5,083 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది. మిలటరీ హెలికాప్టర్లను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి, ష్టిల్‌ క్షిపణులను రష్యాకు చెందిన జేఎ్‌ససీ రోసోబోరోనెక్స్‌పోర్టు అనే కంపెనీ నుంచి కొనుగోలు చేయనుంది. ఏఎల్‌హెచ్‌ ఎంకే-2 హెలికాప్టర్లను ఇండియన్‌ కోస్ట్‌ గార్డుకు అందించనుండగా, ష్టిల్‌ క్షిపణులను భారత నావికాదళం యుద్ధ నౌకలపై మోహరించనున్నారు. హెచ్‌ఏఎల్‌ నుంచి రూ.2,901 కోట్ల విలువైన ఏఎల్‌హెచ్‌ హెలికాప్టర్లు, ఆపరేషనల్‌ రోల్‌ పరికరాలు, ఇంజనీరింగ్‌ సపోర్టు ప్యాకేజీ, పనితీరు ఆధారిత లాజిస్టిక్‌ సపోర్టు కోసం ఒప్పందం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఉపరితలం-గగనతలం వర్టికల్‌ లాంచ్‌ ష్టిల్‌ క్షిపణులు, సంబంధిత క్షిపణి హోల్టిండ్‌ ఫ్రేమ్‌ల సేకరణకు రష్యా కంపెనీతో రూ.2,182 కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.

Updated Date - Mar 04 , 2026 | 03:23 AM