లెబనాన్ నుంచి భారత్‌కు 177 మంది
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:46 AM
ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
ఖతార్ నుంచి బయలుదేరిన మరో 500 మంది
న్యూఢిల్లీ, మార్చి 12: ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. లెబనాన్ నుంచి తొలి బ్యాచ్‌లో 177 మందితో బయలుదేరిన చార్టర్డ్ విమానం ఢిల్లీకి చేరుకుందని బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ విమానాన్ని వారు ఉద్యోగం చేస్తున్న కంపెనీ యజమాని ఏర్పాటు చేశారు. ఇక ఖతార్‌లో చిక్కుకుపోయిన 500మందికి పైగా భారతీయులు ఖతార్ ఎయిర్‌వేస్ విమానం ద్వారా స్వదేశానికి ప్రయాణమయ్యారని అక్కడి భారత రాయబార కార్యాలయం పేర్కొంది.