ఇక కావలసినంత పెట్రోలు, డీజిల్
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:21 AM
చమురు సరఫరా మెరుగుపడడంతో పెట్రోలు, డీజిల్ కొనుగోలుకు సంబంధించి వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై విధించిన ...
వాణిజ్య వినియోగదారులపై ఆంక్షల ఎత్తివేత
న్యూఢిల్లీ, జూన్ 29: చమురు సరఫరా మెరుగుపడడంతో పెట్రోలు, డీజిల్ కొనుగోలుకు సంబంధించి వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై విధించిన ఆంక్షలను ఎత్తివేయనున్నట్టు సోమవారం కేంద్రం ప్రకటించింది. దీంతో పాటుగా ఒక వాహనానికి ఒక రోజుకు 200 లీటర్ల మించి డీజిల్‌ను విక్రయించకూడదన్న పరిమితిని కూడా తొలగించనుంది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా చమురు సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో జూన్ 12న కేంద్రం ఈ ఆంక్షలను విధించింది.