Share News

దేశంలో తొలి ‘కారుణ్య మరణం’

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:34 AM

దేశంలో మొట్టమొదటి ‘కారుణ్య మరణం’ మంగళవారం ఢిల్లీ ఎయిమ్స్‌లో నమోదయింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ప్రాణాధార వ్యవస్థను తొలగించడంతో...

దేశంలో తొలి ‘కారుణ్య మరణం’

  • ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూసిన హరీష్‌ రాణా

న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలో మొట్టమొదటి ‘కారుణ్య మరణం’ మంగళవారం ఢిల్లీ ఎయిమ్స్‌లో నమోదయింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ప్రాణాధార వ్యవస్థను తొలగించడంతో 13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీష్‌ రాణా అనే 31 ఏళ్ల యువకుడు కన్నుమూశాడు. పంజాబ్‌ యూనివర్సిటీలో బీటెక్‌ చదివిన హరీష్‌ 2013లో నాలుగంతస్తుల భవనం నుంచి జారి పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచి కోమాలో ఉన్నాడు. కోలుకునే అవకాశాలు లేకపోవడంతో కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వాలని తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ 11న ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్యులు హరీశ్‌ ప్రాణాధార వ్యవస్థను తొలగించారు.

Updated Date - Mar 25 , 2026 | 03:34 AM