భారత్ చేరిన మరో ‘ఎల్పీజీ’ నౌక
ABN , Publish Date - Mar 18 , 2026 | 03:57 AM
నందాదేవి అన్న పేరుగల భారీ నౌక 47వేల టన్నుల ఎల్పీజీతో హోర్ముజ్ జలసంధిని దాటుకుని క్షేమంగా గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వచ్చేసింది.
47 వేల టన్నుల ఎల్పీజీతో గుజరాత్ పోర్టుకు నందాదేవి
న్యూఢిల్లీ, మార్చి 17: నందాదేవి అన్న పేరుగల భారీ నౌక 47వేల టన్నుల ఎల్పీజీతో హోర్ముజ్ జలసంధిని దాటుకుని క్షేమంగా గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వచ్చేసింది. అంతకుముందు వచ్చిన శివాలిక్‌లో 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చింది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు నౌకల ద్వారా 93వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ దేశంలోకి రావడం ఇంధన సంక్షోభం వేళ పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. ఇందులో 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తమిళనాడుకు పంపనున్నట్లు తెలిసింది. ఇక, దాదాపు భారతీయ జెండాలతో 28 నౌకలు, 611 మంది నావికా సిబ్బంది ప్రస్తుత యుద్ధ సంక్షోభంలో చిక్కుకుపోయి ఉన్నారు. వాటిలో ఒకటైన జగ్ లడ్కీ నౌక 80,800 టన్నుల ముడి చమురును యూఏఈ నుంచి తీసుకొస్తోంది. ఇందులో 22 మంది నావికా సిబ్బంది ఉన్నారు.