Share News

వరుసగా రెండో ఏడాది 1 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:40 AM

బొగ్గు ఉత్పత్తిలో భారత్‌ మరోసారి కీలక మైలురాయిని అధిగమించింది. ఈ నెల 20 నాటికి ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించినట్లు కేంద్ర బొగ్గుగనుల శాఖ తెలిపింది.

వరుసగా రెండో ఏడాది 1 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి

న్యూఢిల్లీ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): బొగ్గు ఉత్పత్తిలో భారత్‌ మరోసారి కీలక మైలురాయిని అధిగమించింది. ఈ నెల 20 నాటికి ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించినట్లు కేంద్ర బొగ్గుగనుల శాఖ తెలిపింది. వరుసగా రెండో ఏడాది ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. ఈ పరిణామం ఇంధన రంగలో భారత్‌ స్వయం సమృద్ధిని, పరిశ్రమలకు అంతరాయం లేని ఇంధన సరఫరాను అందించడంలో దేశ నిబద్ధతను స్పష్టం చేస్తోందని తెలిపింది. ఇంధన భద్రత, స్వయం సమృద్ధిపై తమకున్న నిబద్ధతకు ఈ విజయం అద్దం పడుతోందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Mar 22 , 2026 | 05:40 AM