Share News

నూకల ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు!

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:39 AM

దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో నూకల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నూకల ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు!

న్యూఢిల్లీ, నవంబరు 3: దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో నూకల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బియ్యం ధర రూ.31 వేలు దాటడం, విదేశీ కొనుగోలుదారులు, దేశీయ పరిశ్రమల మధ్య పోటీ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భారత బియ్యం ఎగుమతుల సమాఖ్య (ఐఆర్‌ఈఎఫ్‌) తెలిపింది. అంతేకాకుండా ఇథనాల్‌ తయారీదారులు, పౌలీ్ట్ర ఆహార ఉత్పత్తిదారుల మధ్య పోటీ నెలకొనడం కూడా మరో కారణమని పేర్కొంది. ప్రత్యేకించి 2027లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం వల్ల కూడా నూకల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశాలుంటాయని ఐఆర్‌ఈఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వినోద్‌ కౌల్‌ అన్నారు. గతంలోనూ దేశంలో బియ్యం లభ్యత, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని 2022 సెప్టెంబరులో నూకల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 2025 మార్చి 7 వరకు ఇవి కొనసాగాయి. ఆ తరువాత ఆంక్షలను ఎత్తివేసింది. కాగా, దేశంలో అక్టోబరు 10న క్వింటాలుకు రూ.2,883గా ఉన్న నూకల హోల్‌సేల్‌ సగటు ధర ఈ నెల (నవంబరు) 2 నాటికి రూ.3,036కు చేరింది. అంటే ఏకంగా 5.3 శాతం పెరగడం గమనార్హం

Updated Date - Nov 04 , 2026 | 04:39 AM