Share News

భారత ఎల్‌పీజీ దిగుమతుల్లో తీవ్ర లోటు!

ABN , Publish Date - May 23 , 2026 | 03:53 AM

దేశంలో వంటింటి గ్యాస్‌ కొరత తీవ్ర రూపం దాల్చబోతోందా? రాబోయే రోజుల్లో గ్యాస్‌కు ఇక్కట్లు తప్పవా? ప్రస్తుత ఎల్‌పీజీ దిగుమతుల్లో నెలకొన్న కొరతను గమనిస్తే ఈ ప్రశ్నలకు ...

భారత ఎల్‌పీజీ దిగుమతుల్లో తీవ్ర లోటు!

  • రోజుకు 4లక్షల బ్యారెళ్ల కొరత

న్యూఢిల్లీ, మే 22: దేశంలో వంటింటి గ్యాస్‌ కొరత తీవ్ర రూపం దాల్చబోతోందా? రాబోయే రోజుల్లో గ్యాస్‌కు ఇక్కట్లు తప్పవా? ప్రస్తుత ఎల్‌పీజీ దిగుమతుల్లో నెలకొన్న కొరతను గమనిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభంతో దేశంలో ఎల్‌పీజీ దిగుమతుల్లో కొరత ఏర్పడింది. ప్రస్తుతం ప్రతి రోజూ నాలుగు లక్షల బ్యారెళ్ల ఎల్‌పీజీ కొరత నెలకొంటోందని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. నిక్కై ఆసియా నివేదిక ప్రకారం గత ఏప్రిల్‌లో ఎల్‌పీజీ దిగుమతి రోజుకు 3,77,620 బ్యారెళ్లకు పడిపోయింది. ఈ దిగుమతి ఫిబ్రవరిలో 8,51,870 బ్యారెళ్లుగా ఉండేది. అంటే ప్రస్తుతం ఎల్‌పీజీ దిగుమతి సగానికి పైగా పడిపోయింది. ఈ క్రమంలోనే దేశంలో ఎల్‌పీజీ డిమాండ్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. పైప్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌(పీఎన్‌జీ) కనెక్షన్లు ఉన్న గృహ వినియోగదారులు తమ ఎల్‌పీజీ కనెక్షన్లను వెనక్కి ఇచ్చేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఒక కుటుంబం ఒక కనెక్షన్‌’ నిబంధన కింద ఒకే కుటుంబానికి ఎల్‌పీజీ, పీఎన్‌జీ కనెక్షన్లను అనుమతించరాదని నిర్ణయించారు.

Updated Date - May 23 , 2026 | 03:53 AM