Share News

ప్రభుత్వానికి ఫిర్యాదు కోసం ‘సమాధాన్‌ దీదీ’!

ABN , Publish Date - May 31 , 2026 | 04:54 AM

ప్రభుత్వ శాఖలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడానికి కేంద్రం ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సమాధాన్‌ దీదీ అని దీనికి పేరు పెట్టారు.

ప్రభుత్వానికి ఫిర్యాదు కోసం ‘సమాధాన్‌ దీదీ’!

  • కొత్త చాట్‌బాట్‌ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

  • తెలుగు, హిందీ సహా 22 భాషల్లో ఫిర్యాదుకు అవకాశం

న్యూఢిల్లీ, మే 30: ప్రభుత్వ శాఖలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడానికి కేంద్రం ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సమాధాన్‌ దీదీ అని దీనికి పేరు పెట్టారు. అంటే ఇంట్లో అక్క లాగా మన సమస్యలన్నీ ఓపిగ్గా విని అర్థం చేసుకుంటుంది. ఫిర్యాదును నమోదు చేసుకుంటుంది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ శనివారం దీన్ని ఆవిష్కరించారు. ఇది ఫలానా శాఖ సమస్య అని ఎంచుకోవాల్సిన పని లేదు. సొంత భాషలో సాధారణ మాటల్లో చెబితే చాలు. సమాధాన్‌ దీదీయే ఏ శాఖకు, ఏ ఉపశాఖకు సంబంధించిన సమస్యో గుర్తు పడుతుంది. అవసరమైన ప్రశ్నలు అడిగి ఫిర్యాదును సంబంధింత శాఖాధికారికి పంపుతుంది. భారతీయ భాషలన్నింటిలో ఎలా పని చేస్తుందో శనివారం ప్రారంభం సందర్భంగా డెమో చూపించారు. రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషలతో పాటు పలు రాష్ట్రాల హిందీ మాండలీకాలను, గిరిజన భాషలను సమాధాన్‌ దీదీలో చేర్చామని వెల్లడించారు.

Updated Date - May 31 , 2026 | 04:54 AM