Share News

భారత్‌కు రష్యా చమురు భరోసా!

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:25 AM

హోర్ముజ్‌ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్‌ భారీగా పెంచింది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రష్యా నుంచి చమురు దిగుమతులు ఏకంగా 90 శాతం పెరిగాయని.....

భారత్‌కు రష్యా చమురు భరోసా!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: హోర్ముజ్‌ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్‌ భారీగా పెంచింది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రష్యా నుంచి చమురు దిగుమతులు ఏకంగా 90 శాతం పెరిగాయని ఓ వార్తా సంస్థ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం చమురు దిగుమతులు 15 శాతం తగ్గినప్పటికీ, రష్యా నుంచి కొనుగోళ్లు పెరగడం గమనార్హం. పోయిన డిసెంబరుతో పాటు ఈ ఏడాది ప్రారంభంలో రష్యా నుంచి దిగుమతులు కొంత తగ్గినప్పటికీ, అమెరికా ఇచ్చిన 30 రోజుల ప్రత్యేక మినహాయింపు భారత్‌కు కలిసి వచ్చింది. దీనివల్ల ఆంక్షల పరిధిలో ఉన్న చమురును కూడా భారత్‌ దిగుమతి చేసుకోగలిగింది. తాజాగా భారత ఇంధన అవసరాలను తీర్చడానికి వీలుగా ముడిచమురు, సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరాను మరింత పెంచుతామని రష్యా ప్రతిపాదించింది. ఏప్రిల్‌ నుంచి వెనుజువెలా, ఇరాన్‌ నుంచి కూడా భారతదేశం చమురు దిగుమతులు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 04:25 AM