ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - May 04 , 2026 | 03:42 AM
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అగ్నిప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది.
నేటి నుంచి ఈ నెల 10 దాకా కార్యక్రమం
న్యూఢిల్లీ, మే 3: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అగ్నిప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఈ నెల 10 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా.. అగ్ని ప్రమాదాలను నివారించడం, వాటిని అరికట్టడంపై అవగాహన కల్పించడం, మాక్‌డ్రిల్స్ చేపట్టడం, సిబ్బందికి ఫైర్ సేఫ్టీ నిబంధనల్ని, రోగుల అత్యవసర తరలింపు విధానాలను వివరించడం వంటివి నిర్వహిస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కలిసి కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో ఈ వారోత్సవాల ప్రారంభం సందర్భంగా ‘ఫైర్ సేఫ్టీ’పై ప్రతిజ్ఞ చేయించనున్నారు.