గ్యాస్ కొరతపై ఆందోళన వద్దు
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:46 AM
గ్యాస్ కొరతపై ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. భయపడాల్సిన పని లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. గృహ వినియోగానికి...
దేశీయంగా చమురు ఉత్పత్తిని 25% పెంచాం: కేంద్రం
గ్యాస్ కొరతపై ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. భయపడాల్సిన పని లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. గృహ వినియోగానికి సంబంధించి అవసరానికి సరిపడా నిల్వలు దేశంలో ఉన్నాయని.. యుద్ధం కారణంగా సరఫరాలో ఏర్పడిన ఆటంకాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని చమురు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. అందులో భాగంగానే దేశీయంగా చమురు ఉత్పత్తిని 25ు పెంచామని.. సరఫరాను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే రెండు ఎల్‌ఎన్‌జీ కార్గోలను సమకూర్చుకున్నామని, అవి రెండ్రోజుల్లోపే దేశానికి చేరుకుంటాయని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు.