ఎరువుల ఉత్పత్తిలో 25 శాతం మేర పతనం
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:52 AM
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారతదేశంలో ఎరువుల ఉత్పత్తిపై పడింది. మార్చి నెలలో దేశంలో ఎరువుల ఉత్పత్తి 25 శాతం మేర పడిపోయిందని కేంద్రం ప్రకటించింది.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతోనే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారతదేశంలో ఎరువుల ఉత్పత్తిపై పడింది. మార్చి నెలలో దేశంలో ఎరువుల ఉత్పత్తి 25 శాతం మేర పడిపోయిందని కేంద్రం ప్రకటించింది. సహజవాయువును ఉపయోగించి దేశంలో యూరియా ఉత్పత్తి జరుగుతోంది. అయితే, యుద్ధ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి మూసివేత సహజవాయువు దిగుమతిపై పడింది. సహజవాయువు దిగుమతులు తగ్గడంతో మార్చి నెలలో ఎరువుల ఉత్పత్తి 24.6 శాతం మేర పడిపోయిందని కేంద్రం సోమవారం ప్రకటించింది. అయితే, 2025 డిసెంబరులో ఎరువుల ఉత్పత్తిలో 4.1 శాతం వృద్ధి నమోదవ్వగా.. 2026 జనవరిలో 3.7 శాతం, ఫిబ్రవరిలో 3.4 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. కాగా, దేశీయ అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. సాధారణంగా ఖరీ్‌ఫకు సంబంధించి జూన్-జూలై నెలల్లో, రబీకి అక్టోబరు, నవంబరు నెలల్లో ఎరువులకు డిమాండ్ ఉంటుంది.