Share News

ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ మీదుగా భారత్‌కు

ABN , Publish Date - Mar 18 , 2026 | 03:59 AM

ఇరాన్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ మీదుగా భారత్‌కు

న్యూఢిల్లీ, మార్చి 17: ఇరాన్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యుద్ధం కారణంగా ఇరాన్‌ గగనతలం మూసివేయడంతో రోడ్డు మార్గంలో వారిని సరిహద్దులు దాటించి ఇతర దేశాల నుంచి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్‌కు పొరుగున ఉన్న ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాలతో సంప్రదింపులు జరిపి రోడ్డు మార్గంలో సరిహద్దులు దాటించే ఏర్పాట్లు చేసింది. ఆయా దేశాల నుంచి భారత్‌కు విమాన సర్వీసులు కొనసాగుతుండడంతో తొలుత వారిని ఇరాన్‌ నుంచి ల్యాండ్‌ బోర్డర్ల ద్వారా ఆర్మేనియా, అజర్‌బైజాన్‌కు తరలిస్తోంది. సుమారు 650 మంది భారతీయులు సరిహద్దుల ద్వారా ఇప్పటికే ఈ దేశాల్లోకి ప్రవేశించారని కేంద్రం తెలిపింది. .

Updated Date - Mar 18 , 2026 | 03:59 AM