Share News

ఇరాన్‌ నుంచి సురక్షితంగా 1,200 మంది భారతీయుల రాక

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:07 AM

ఇరాన్‌లో ఉన్న 1,200 మందికిపైగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినట్టు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ చెప్పారు. వీరిలో 845 మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు.

ఇరాన్‌ నుంచి సురక్షితంగా 1,200 మంది భారతీయుల రాక

  • అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మీదుగా తరలింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ఇరాన్‌లో ఉన్న 1,200 మందికిపైగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినట్టు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ చెప్పారు. వీరిలో 845 మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాల మీదుగా వారిని తరలించినట్టు తెలిపారు. ఆ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు చేశాయని వివరించారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తరువాత అక్కడ నుంచి ఇంతవరకు 6.24 లక్షల మంది భారత్‌కు తిరిగి వచ్చారని ఆ శాఖ అదనపు కార్యదర్శి (గల్ఫ్‌) అసీం ఆర్‌ మహాజన్‌ చెప్పారు. ఆయా దేశాలకు పరిమితంగానే విమానాలు నడుస్తున్నాయని అన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 04:07 AM