Share News

సిలిండర్లకు గుడ్‌బై.. పీఎన్‌జీకి జై

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:10 AM

దేశవ్యాప్తంగా పైప్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

సిలిండర్లకు గుడ్‌బై.. పీఎన్‌జీకి జై

న్యూఢిల్లీ, మార్చి 29: దేశవ్యాప్తంగా పైప్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. శనివారం నాటికి సుమారు 6 వేల మంది వినియోగదారులు స్వచ్ఛందంగా తమ ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్నట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌ తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న వినియోగదారులను ఆయన ‘సాహసోపేతమైన పౌరులుగా’ అభివర్ణిస్తూ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నెలలోనే దేశవ్యాప్తంగా 2.9 లక్షల కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు అందించినట్లు కేంద్రం తెలిపింది.

Updated Date - Mar 30 , 2026 | 04:10 AM