పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ పంపిణీ
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:09 AM
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో వంటతోపాటు దీపాల వెలుతురు కోసం పౌరులకు కిరోసిన్ పంపిణీపై కేంద్రం నిబంధనలను సడలించింది.
న్యూఢిల్లీ, మార్చి 29: ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో వంటతోపాటు దీపాల వెలుతురు కోసం పౌరులకు కిరోసిన్ పంపిణీపై కేంద్రం నిబంధనలను సడలించింది. పెట్రోల్ పంపుల ద్వారా తాత్కాలికంగా 60 రోజుల పాటు కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆదివారం కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఎల్‌పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేయాలని కూడా కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్లు అనుమతించిన మేరకు ప్రతి జిల్లాలో 2 పెట్రోల్ పంపులు 5,000 లీటర్ల కిరోసిన్‌ను నిల్వ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.